వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ తో బైక్ ను ఢీకొట్టి అదే వేగంతో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొంది. కారు బైక్ ను ఢీ కొనడంతో బైక్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు బిట్స్ కళాశాల విద్యార్ధిగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.