రాజస్థాన్‌లోని అబు రోడ్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం అర్థరాత్రి దారుణ ఘటన జరిగింది. రిజర్వేషన్ ఆఫీస్ సమీపంలో ఓ ఫ్యామిలీ నిద్రిస్తోంది. ఆ సమయంలో ఓ ఎద్దు అక్కడికి వచ్చింది. ఏడాది వయసున్న బాలికను ఆ ఎద్దు తొక్కింది. చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కళ్ల ముందే కుమార్తె చనిపోవడంతో తండ్రి గులాబ్ రామ్ గుండెలు అవిసేలా రోదించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.