వరంగల్ జిల్లా నర్సంపేటలోని మాదన్నపేట రోడ్డు లో సోమవారం కోడిపందాలు ఆడుతున్న వ్యక్తులను పోలీసులుఅదుపు లోకి తీసుకున్నారు. 14 వేల నగదుతో పాటు ఏడుగురుపై కేసు నమోదు చేసి 7 సెల్ ఫోన్లు, ఐదు బైకులు, పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో ఎస్సై రవికుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.