10వ తరగతి విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాసెస్

149చూసినవారు
10వ తరగతి విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాసెస్
నెక్కొండ మండలంలోని మోడల్ స్కూలులో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఓరియంటేషన్ (అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు నూతన పరీక్ష విధానం ప్రకారం చదవాల్సిన మెలకువల గురించి మండల స్థాయి రిసోర్స్ పర్సన్స్ తో మండలంలోని వివిధ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రత్నమాల, జెడ్ పి హెచ్ ఎస్ అలంకానిపేట హెచ్ఎం జ్యోతిలక్ష్మి, DCEB సెక్రటరీ కృష్ణమూర్తి, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీధర్, కేజీబివి SO సరిత, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉదయశ్రీ, వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, పాల్గొని తమ సందేశాన్ని సూచనలను అందించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్