నర్సంపేట పట్టణంలోని గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీలు ఉన్న సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు జరగనున్నట్లు ప్రిన్సిపల్ సంగీత్ సాగర్ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఓసీ విద్యార్థులు మధ్యాహ్నం వరకు ప్రభుత్వ గిరిజన గురుకుల కళాశాలలో సంప్రదించాలని, విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.