బ్రోకర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలి

862చూసినవారు
బ్రోకర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలి
కబ్జాకు గురైన ప్రభుత్వ అసైన్డ్ భూములను వెలికితీసి అర్హులైన పేదలకు పంచాలని ఈ క్రమంలో అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్ డివిజన్ కార్యదర్శి కన్నం వెంకన్న డిమాండ్ చేశారు. లేకపోతే పేదలే అట్టి భూములను స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు‌. బుధవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఆధ్వర్యంలో నర్సంపేట శివారులోని సర్వే నంబర్ 813 ప్రభుత్వ అసైన్డ్ భూమి లో వెలిసిన అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ భూమిని, ఆక్రమణకు గురైన మాదన్నపేట వట్టె వాగు స్థలాన్ని పార్టీ ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములన్నీ యదేచ్చగా కబ్జా చేసి విక్రయాలు జరుపుతున్న రెవెన్యూ యంత్రాంగం కనీస పట్టింపు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నర్సంపేట పరిధిలో 813, 709, 111, 56, 702,62, 194 తదితర సర్వేనెంబర్ లోని ప్రభుత్వ భూమి గతంలో కొంత మంది పేదలకు కొంత భూమి అసైన్ చేసిన మిగతా భూమి ఏమైందో తెలియటం లేదని వ్యవసాయం కోసం చేసిన భూమి సైతం ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు కొనుగోలు చేపడుతూ పచ్చని పంటపొలాలు సైతం బీడు భూములుగా మార్చి పేద మధ్య తరగతి ప్రజలను మభ్యపెట్టి అధికార యంత్రాంగం అండదండలతో కోట్లు గడిస్తున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ లపై కనీస చర్యలు లేకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదల భూములను ఆక్రమిస్తారని హెచ్చరించారు. పార్టీ పరిశీలించిన అన్ని వివరాలను సంబంధిత అధికారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్శినలో పార్టీ డివిజన్ నాయకులు కుసుంభ బాబురావు, కేశేట్టి సదానందం, కొత్తకొండ రాజమౌళి, పొన్నాల మైపాల్, చెక్క వెంకటయ్య, యాసారపు చందు, భాష స్వామి, రమేష్, భూ పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్