నెల్లికుదురు: అద్భుతంగా సాగిన పదవి విరమణ సన్మాన కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలోని స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ రావ్ పదవి విరమణ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమం అద్యంతం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మంగతాయి మాట్లాడుతూ, సమాజానికి నేటి ఉపాధ్యాయుల అవసరం గూర్చి తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు మండల ఎంఇఓ రాందాసు, తదితరులు హాజరయ్యారు.