శ్రీ నలంద విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన

1007చూసినవారు
శ్రీ నలంద విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన
సస్య భారత్ లో భాగంగా తొర్రూర్ పట్టణానికి చెందిన శ్రీ నలంద పాఠశాల విద్యార్థులు, ప్రిన్సిపాల్ రవీందర్ ఆధ్వర్యంలో సోమవారం మండలానికి చెందిన హచ్చు తండా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వ్యవసాయంపై పలు రకాల విషయాలను తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థులు మిరప, వరి, మొక్కజొన్న పంట పొలాలలోకి స్వయంగా దిగి రైతులతో పని చేస్తూ వారి యొక్క కష్టసుఖాలను, వివిధ రకాల పంటలు పండించేటప్పుడు పడే బాధలను, పంటలు పండించే విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ... రైతు దేశానికి వెన్నెముక అని అలాంటి రైతు పండించే, పండ్లు, కూరగాయలు, వివిధ రకాల ధాన్యాలను సరియైన ధరకు కొని రైతులను ప్రోత్సహించడమే కాకుండా వ్యవసాయాన్ని బతికించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మంగళంపల్లి హుస్సేన్, శ్రీ నలంద పాఠశాలల డిజిఎం చేతన్, ఆర్ ఐ రామ్కి , జోనల్ అకాడమిక్ కోఆర్డినేటర్ మహేష్ ,శ్రీ నలంద పాఠశాల అకాడమిక్ డీన్ యాకన్న ,పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యాకన్న , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్