దొడ్డి కొమురయ్యకు ఎమ్మెల్యే ఘనంగా నివాళులు

78చూసినవారు
దొడ్డి కొమురయ్యకు ఎమ్మెల్యే ఘనంగా నివాళులు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, భూమికోసం, భుక్తికోసం, జాతి విముక్తి కోసం, ప్రాణాలు ఒడ్డిన తెలంగాణ ముద్దుబిడ్డ, దొడ్డి కొమురయ్య అని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. గురువారం దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా పాలకుర్తిలో ఆ మహనీయుడి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్