అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు, దామెర మండలాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, గణన సర్వేపై అవగాహన కల్పిస్తూ కార్యకర్తలను చైతన్యం చేశారు.