నెల్లికుదుర్ మండలం పెద్ద తండా(మేచరాజు పల్లి) గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కుంట తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి బుధవారం ఉదయం తండా లో బడి బాట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ పరమేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులను ఉచితంగా కల్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతున్నారని ప్రభుత్వ బడులల్లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సెక్రటరీ కళ్యాణ్, వార్డు సభ్యులు, పంచాయితీ సిబ్బంది, ప్రజలు పాల్గోన్నారు.