గీసుకొండలోని దళిత కాలనీలో 11కేవీ తీగ తెగి కిందపడటంతో సాయిబాబకు చెందిన పాడి గేదె విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు గ్రామస్థులు తెలిపారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశడ్డిని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ మధు సూదన్రెడ్డి దళితకాలనీని సందర్శించి 11కేవీ లైన్ ను పరిశీలించారు.