వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలుకేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.