విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు మంగళవారం నిర్వహించ తలపెట్టిన ఆర్టిజన్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ ల్లా అధ్యక్షులు శనిగరపు రాజు తెలిపారు.బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించరు. శనిగరపు రాజు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులు లేకుండా చేసి రెగ్యులరైజ్ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ఇతెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ లకు నోటీసులు జారీ చేయడం, ఎస్మా ప్రయోగిస్తామనడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే ఆర్టిజన్ కార్మికులు 23, 000 మందిని రెగ్యులరైజ్ చేయాలని, రూరల్ పర్సనల్ పే ను బేసిక్ పేతో కలిపిన తర్వాత 50శాతం పిఆర్సీ ఫిట్ మెంట్ ఇవ్వాలని, ఆర్టిజన్ల విద్యార్హత ప్రకారం క్యాడరైజ్ చేసి సంస్థలో తగిన పర్మనెంట్ హోదా ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ సారయ్య వరంగల్ జోనల్ మహిళా కన్వీనర్ పద్మ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రీ హనుమకొండ సుజాత రఘు వెంకటేష్ రజిత తదితరులు పాల్గొన్నారు వి