కాట్ర పల్లి గ్రామంలో ఆరంభమైన కంటివెలుగు కార్యక్రమం

171చూసినవారు
కాట్ర పల్లి గ్రామంలో ఆరంభమైన కంటివెలుగు కార్యక్రమం
తెలంగాణ ప్రభుత్వం అంధత్వ లోపం ఉన్న బాధితుల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సర్పంచ్ లఫోరమ్ అధ్యక్షులు స్థానిక సర్పంచ్ శ్రీ పూలుగు సాగర్ రెడ్డి అన్నారు. సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామంలోని అంధత్వ(కంటి చూపు) లోపం ఉన్న వారు గ్రామ పంచాయితీలో ఏర్పాటు చేసిన శిబిరానికి సకాలంలో వచ్చి పరీక్షలు చేయించుకొని దృష్టి తీవ్రత మేరకు కంటిచూపు అద్దాలు, మెడిసిన్స్ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి గాయపు ప్రచూర్ణ-భాస్కర్ రెడ్డి గారు, ఉపసర్పంచ్ జెల్లిక రజిత - ఐలయ్య గారు, స్థానికవార్డ్ సభ్యులు మరియు మెడికల్ ఆఫీసర్ సదానందం, ఆప్తమాలజిస్ట్ శ్యామ్, సూపర్వైజర్ గోవర్ధన్, ఏఎన్ఎం సుజాత, ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్