గీసుగొండ మండలం కొనయ మాకుల గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. పరకాల నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వ పాలకుల చేతుల్లో గ్రామాలు నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైనాయని, నేడు కాంగ్రెస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.