ప్రభుత్వం విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల మండలం మల్లక్క పేట తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను శనివారం సందర్శించారు. ఇటీవలే పాఠశాల అభివృద్ధికి 21 లక్షల 50 వేల రూపాయల నిధులు ప్రభుత్వం మంజూరు చేసి చేసింది. అయినా ఇంకా నిర్మాణ పనులు మొదలు కాకపోవడంతో అధికారులపై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు.