గీసుగొండ మండలం కొనయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సోమవారం సందర్శించారు. పంపు హౌస్, మోటుర్లకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొనయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాలకు ఆయకట్టు నీరు అందించడం జరుగుతుందన్నారు.