దామెర మండలం ఓగ్లాపూర్ మైనారిటీ పాఠశాల, కళాశాలలో అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరంచుకుని జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నాటి పిల్లలు దేశానికి రేపటి పౌరులు, పిల్లలు మహనీయుడైనటువంటి అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎదగాలని తెలిపారు.