Sep 20, 2024, 13:09 IST/
ఈ ఆహారాలతో విటమిన్ డి లోపానికి చెక్ పెట్టండి
Sep 20, 2024, 13:09 IST
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలా ముఖ్యం. సహజంగా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఇలా పొందలేని వారు కొన్ని ఆహారాలు తీసుకోవడం మంచిది. కొవ్వు చేపల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపల్లో ఈ విటమిన్ లభిస్తుంది. కోడి గుడ్డు తిన్నా విటమిన్ డి అందుతుంది. కోడి గుడ్డు పచ్చసొనలో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది. అలాగే పుట్ట గొడుగులు, రొయ్యలను ఆహారంలో బాగం చేసుకుంటే శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.