Mar 27, 2025, 08:03 IST/ములుగు
ములుగు
ములుగు: విద్యుత్ షాక్తో వ్యక్తికి గాయాలు
Mar 27, 2025, 08:03 IST
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం చంద్రుతండా గ్రామానికి చెందిన బానోతు యాకూబ్ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ గా పని చేస్తుండేవాడు. రోజువారి పనిలో భాగంగా బుధవారం రాత్రి చంద్రుతండాలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద బాధితుడిని గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పరామర్శించారు.