దేశంలో ఐపీఎల్ 18వ సీజన్ సందడి మొదలైంది. దీంతో బెట్టింగ్ రాయులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ. 1,30,000, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ నగర్‌కి చెందిన లదా, నారాయణగూడకు చెందిన అగర్వాల్‌లు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.