TG: రంగారెడ్డి జిల్లాలోని 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 'ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది’ అని గతంలో సీఎం రేవంత్ అన్నట్లు గుర్తు చేశారు. పర్యావరణానికి మీరు చేయబోయే ఈ నష్టం తిరిగి పూడ్చలేనిదన్నారు.