స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ నేతలతో త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహిస్తారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని బిఆర్ఎస్ నేతలు యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తదితరులు ఉన్నారు.