జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కొనాయిచలం గ్రామంలో సొంటి రెడ్డి మల్లారెడ్డి అనే రైతుకు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందింది. వ్యవసాయ భావి వద్ద విద్యుత్ స్తంభానికి ఉన్న ఎర్త్ వైర్ కు కరెంటు సరఫరా కావడంతో ఎద్దు మృతి చెందిందని మల్లారెడ్డి తెలిపారు. దీంతో రూ: 70, 000 నష్టం జరిగిందని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.