స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. తెలంగాణ భవన్ లో రాజయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ సారథ్యంలో ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు.