జనగాం జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల ముఖ చిత్రాలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. గత 24వ రోజులుగా సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సీఎం తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయంలో ఇచ్చిన హామీనీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో స్టేషన్ ఘనపూర్ ఉద్యోగులు పాల్గొన్నారు.