వరంగల్ ఎంపీ కడియం కావ్య శుక్రవారం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బాల సముద్రంలో చిన్నారులతో కలసి క్రాకర్స్ కాలుస్తూ వారికి జాగ్రత్తలు చెప్పారు. ఎంపీగా ఎంత బిజీగా ఉన్నపటికీ ప్రతి పండగను చిన్నారులతో కలసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారదోలే వెలుగుల పండుగ దీపావళి అన్నారు. ఈ దీపావళి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఎంపీ ఆకాంక్షించారు.