జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేపట్టారు. ఈ దాడిలో ఆంజనేయులు, గుర్రం ప్రభాకర్, జోగి యాకుబ్, జోగు రాజు, జోగు బాబు, గాదె కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ: 5, 100 నగదు, ప్లేకార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.