నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీగా పని చేస్తానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిడుగు గ్రామంలోని భవాని శంకర దేవాలయాన్ని ఎమ్మెల్యే కడియం ఆదివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామం నుండి జఫర్గడ్ వైపు వెళ్లే రోడ్డు అద్వానంగా మారిందని త్వరలోనే డబల్ రోడ్డు వేపిస్తామని హామీ ఇచ్చారు.