వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు మంగళవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రంగశాయిపేట, సంగం మండలంలో పర్యటించి ఆశా డే కార్యక్రమమును రివ్యూ చేసారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ప్రభుత్వం సూచించిన నిర్దేశాలకు అనుగుణంగా ఆశా కార్యకర్తల నుండి వైద్యాధికారుల వరకు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించి జిల్లాను ఆరోగ్య జిల్లాగా మార్చాలని సూచించారు.