జనగామ, వరంగల్ జిల్లాల స్థాయి ప్రేరణ ఉత్సవ్ పోటీలు బుధవారం వరంగల్ జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించారు. ప్రారంభ సమావేశంలో పర్యవేక్షకులుగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి బొమ్మనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని అంతర్గత సృజనాత్మకతకు ప్రేరణ కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.