వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలములో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికీ ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని చట్టాలను సైతం పొందుపరిచారని చెప్పారు.