దాశరథి సేవలు అసమానం: మంత్రి సురేఖ

51చూసినవారు
దాశరథి సేవలు అసమానం: మంత్రి సురేఖ
తెలంగాణ సాహితీ యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు సాహిత్య రంగానికి చేసిన సేవలు నిరుపమానం అని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని పురస్కరించుకొని మంత్రి ఆయన సేవలు కొనియాడారు. పదునైన అక్షరాలను ఆయుధాలుగా మలిచి, అణచివేతకు వ్యతిరేకంగా దాశరథి పూరించిన శంఖారావం తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రేరేపించిందన్నారు.

సంబంధిత పోస్ట్