పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో ధర్నా

68చూసినవారు
అన్నదమ్ముల మధ్య స్థల వివాదం ఒకరి ప్రాణం తీసింది. దీంతో వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం మృతదేహంతో బాధితులు నిరసన తెలిపారు. శివనగర్ కు చెందిన పసునూటి రాజు 2008లో పట్టా పొందాడు. ఆ స్థలం తనదంటూ సోదరుడు సాంబయ్య పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాజును ఎస్సై సురేశ్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టాడు. దీంతో రాజు బీపీ పెరిగి స్టేషన్ ఆవరణలో కిందపడిపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్