ఎంజీఎం సూపరింటెండెంట్ గా డాక్టర్ మురళి

58చూసినవారు
ఎంజీఎం సూపరింటెండెంట్ గా డాక్టర్ మురళి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ గా అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ మురళికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఎంజీఎం ఆస్పత్రి ప్రస్తు త సూపరింటెండెంట్ డాక్టర్ వి. చంద్రశేఖర్ బదిలీపై ములుగు వైద్య కళాశాలకు ప్రొఫెసర్ గా వెళ్లారు. దీంతో తాత్కాలికంగా ఎంజీఎం పరిపాలనతోపాటు చార్జి తీసుకునే విధంగా ప్రొఫెసర్ మురళీకి మంగళవారం బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్