కేయూ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును అపరాధ రుసుములేకుండా ఈనెల 28వతేదీ వరకు పొడిగించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్. నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్ర ణాధికారి తిరుమలాదేవి గురువారం తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో నవంబర్ 2వ తేదీ వరకు గడువు ఉందన్నారు.