నిబంధనలు పాటించని ఆసుపత్రిల పై కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం జిల్లా స్థాయి ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ ఆక్ట్, డెంగ్యూ కేసుల నివారణపై సమావేశం జరిగింది. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ క్లినిక్కులు, పోలీ క్లినికులు హాస్పిటల్స్ నిబంధనలు పాటించాలన్నారు.