వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖ మంగళవారం సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్ పాపను చూసి చలించి పోయారు. వెంటనే తన కాన్వాయ్ ని ఆపి, సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్ళి ఆ చిన్న పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసి పాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వం చాటుకున్నారు.