గంజాయి వ్యసనానికి అలవాటుపడి వాటిని విక్రయిస్తున్న వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు ఇంతెజార్ గంజ్ సీఐ శివకుమార్ తెలిపారు. వరంగల్ వెంకట్రామ జంక్షన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బైక్పై అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న కాశిబుగ్గకు చెందిన బొల్లి శశిధర్ ను పట్టుకున్నట్టు తెలిపారు. అతని వద్ద నుంచి రూ. 10, 700 విలువైన గంజాయి, మోటారు సైకిల్, సెల్ఫోన్ ను సీజ్ చేసి రిమాండుకు పంపినట్టు తెలిపారు.