వరంగల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో పాటు అదనపు కలెక్టర్, ఆర్డీవో, డిఆర్డిఓ, జెడ్పీ సీఈవో పాల్గొని సమస్యల పైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలనిబ్అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో మొత్తం దరఖాస్తులు 95 రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం పెంచాలని కలెక్టర్ తెలిపారు.