పేకాట శిభిరంపై వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సోమవారం రాత్రి సీఐ బాబులాల్ తెలిపారు. వరంగల్ ములుగు రోడ్ హనుమాన్ జంక్షన్ వద్ద గల విజయ్ కుమార్ ఇంట్లో పేకాట అడుతున్నారనే సమాచారం తో దాడి చేసి 7 సెల్ఫోన్ లు, పేకాట కార్డులు, 52 వేల నగదు స్వాధీనం చేసుకొని మట్టేవాడ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.