తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసోసియేషన్ ఎన్నికల్లో వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రాంతానికి చెందిన పస్తం రవికిరణ్ వైస్ ప్రెసిడెంట్ గా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన ఇటీవల అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పదోన్నతి పొంది నర్సంపేట సెషన్స్ కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు అభినందించారు.