డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలను జాగృతం చేసేందుకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహించబోయే డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం సెక్రటేరియట్ లో ఆవిష్కరించారు.