Nov 28, 2024, 13:11 IST/
త్వరలోనే ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు: మంత్రి కోమటిరెడ్డి
Nov 28, 2024, 13:11 IST
తెలంగాణలో త్వరలోనే రైతుల ఖాతాల్లో యాసంగి రైతు భరోసా నిధులు రూ.7,500 జమ చేయబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. గురుకులాల్లో విద్యార్థుల అస్వస్థత ఘటనలపై కేటీఆర్, హరీశ్ రావు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. BRS నేతలు కేటీఆర్, హరీశ్ రావుల వ్యాఖ్యలపై స్పందించనని.. వారిది తన స్థాయి కాదని విమర్శించారు. కేటీఆర్, హరీశ్ రావు పిల్లల్లాంటి వారని ఎద్దేవా చేశారు.