హనుమకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రానికి చెందిన లచ్చమ్మ అనే వృద్ధురాలు గురువారం మృతి చెందడంతో పెద్దమ్మ గుడి వద్ద ఉన్న స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే స్మశాన వాటిక స్థలంపై కోర్టులో కేసు ఉండటంతో మృతదేహాన్ని ఖననం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మృతురాలి బంధువులు, స్థానికులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు.