హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న 70వ తెలంగాణ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ 2024-25ఛాంపియన్ షిప్ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం అందించారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి పోటిల్లో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం క్రీడాల ద్వారా అలవాటు అవలభించుకోవాలని కోరారు.