హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. 11నెలల ప్రజా ప్రభుత్వ పనితీరుపై నిర్వహించే ఇందిరా శక్తి సభ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న కాళోజి కళక్షేత్ర కార్యక్రమాలపై సుదీర్గంగా చర్చించారు.