కోల్కతాలో ఈ నెల 14 నుండి 19వ తారీకు వరకు వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ బాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ లో వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం బాడ్మింటన్ ప్లేయర్ సామల శ్రీ చేతన్ శౌర్య బాయ్స్ డబల్స్ లో మెడల్ సాధించాడు. ఈ క్రీడాకారుడు బాడ్మింటన్ కోచ్ మాడిశెట్టి శ్రీధర్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు. గురువారం క్రీడాకారున్ని పింగిలి రమేష్ రెడ్డి, శంకర్ లింగం అభినందించారు.