వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి అందిన అర్జీల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.